![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1022 లో.. రిషి ఫోటో పట్టుకొని వసుధార ఎమోషనల్ అవుతుంది. మీరు లేకుండా నాకు సెలెబ్రేషన్స్ ఏంటి సర్.. వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకోవడం లేదని ఫోటో చూస్తూ వసుధార మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత మహేంద్రకి ఫోన్ చేసి రేపు వసుధార బర్త్డే అందుకే మను కాలేజీ లో సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేస్తున్నాడని చెప్పగానే దీనికి వసుధార ఒప్పుకుందా అని ఫణింద్ర అడుగుతాడు.. ఒప్పుకోలేదు. మీరైతే రేపు కాలేజీకి రండి అని మహేంద్ర చెప్తాడు.
కాసేపటికి ఇంట్లో అందరిని ఫణీంద్ర పిలిచి రేపు వసుధార బర్త్డే అందరం తప్పకుండా వెళ్ళాలని చెప్తాడు. దేవాయని ఏదో చెప్పబోతుంటే మీరు ఏదైనా కారణం చెప్పి రాకుండా ఉంటే మాత్రం బాగోదని ఫణింద్ర చెప్పి వెళ్లిపోతాడు. మరుసటిరోజు ఉదయం వసుధార కాలేజీకి వెళ్తుంది. కొందరు స్టూడెంట్స్ వచ్చి మేడమ్ క్లాస్ లో స్టూడెంట్స్ గొడవ పెట్టుకుంటున్నారని చెప్తారు. దాంతో వసుధరా కంగారుగా వెళ్తుంది. వాళ్ళని ఆపుతుంది. అప్పుడే హ్యాపీ బర్త్డే మేడమ్ అంటు స్టూడెంట్స్ వసుధారకి సర్ ప్రైజ్ ఇస్తారు. అది చూసి వసుధార కోపంగా.. నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదని తెలుసు కదా అంటు సీరియస్ అవుతుంది. ఇదంతా ఆ మను పని అంటు కోపంగా అతని దగ్గరికి వెళ్తుంది. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా బర్త్డే సెలెబ్రేషన్స్ వద్దు అన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు. నన్ను ఎందుకు ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఎండీ పదవి కావాలని మాటల్లో చెప్తే ఇచ్చేదాన్ని కదా అంటూ మనుపై వసుధార సీరియస్ అయి వెళ్తుంది. అదంతా అనుపమ, మహేంద్రలు వింటారు. మనుని తిడుతుంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావంటు అనుపమని మహేంద్ర అడుగుతాడు.
ఆ తర్వాత స్టూడెంట్స్ అందరు వచ్చి వసుధారకి సారీ చెప్తారు. మీరు ఎందుకు చెప్తున్నారు. ఆ మను గారే ఇదంతా చేశారు కదా అని వసుధార అనగానే... మేమే చేసామ్.. మను సర్ కి అసలేం తెలియదని అనగానే.. అయ్యో నేనే అనవసరంగా మను గారిని అపార్థం చేసుకున్నానా అని మను దగ్గరికి వసుధార వెళ్లి సారీ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |